షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

మండలంలోని ఇందాని గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో చాప్లే ప్రకాష్ ఇల్లు దగ్ధమైంది.

Update: 2024-11-15 12:38 GMT

దిశ, వాంకిడి : మండలంలోని ఇందాని గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో చాప్లే ప్రకాష్ ఇల్లు దగ్ధమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆ లోపే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులతో పాటు నగదు, 30 క్వింటాళ్ల పత్తి, విలువైన సామాగ్రి కాలిపోయింది. దాంతో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. అగ్నిప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Similar News