దిశ, శంకర్ పల్లి : అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల సంగారెడ్డి జిల్లా ముని దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్ల శేఖర్ చారి (30) అవివాహితుడు. కాగా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ ఫ్లై ఓవర్ వద్ద గల రైల్వే ట్రాక్ సమీపంలో శవమై పడి ఉన్నాడని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శంకరపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతని వద్ద ఉన్న ఆనవాళ్ళ ప్రకారం వ్యక్తిని గుర్తించినట్లు సమాచారం. కాగా అతని తమ్ముడు రమేష్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతన్ని ఎక్కడో చంపేసి ఇక్కడ తెచ్చి పడవేశారా? లేక ఇక్కడే చంపేశారా? కారణాలు ఏమై ఉంటాయి? అనే కోణంలో శంకర్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.