విషాదం.. పుష్పగిరి పెన్నా నదిలో యువకుడు గల్లంతు
కార్తీక మాస పౌర్ణమి రోజు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి వద్ద విషాదం చోటుచేసుకుంది.
దిశ, కమలాపురం: కార్తీక మాస పౌర్ణమి రోజు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి వద్ద విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం వివాహమైన గణేష్ (27)అనే యువకుడు గల్లంతవ్వడం అక్కడున్న కలిచివేసింది. కుటుంబ సభ్యులు రోధన హృదయ విదారకంగా మారింది. కడప నగరం ఎన్జీవో కాలనీ చెందిన గణేష్ కుటుంబ సమేతంగా వల్లూరు మండలం పుష్పగిరి వద్దగల పెన్నా నదిలో స్నానమాచరించేందుకు దిగి మునిగి గల్లంతు కావడం జరిగింది. నదిలో మునిగిన వ్యక్తి గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. తోటి భక్తులు కూడా చూస్తూ ఆందోళన చెందడం తప్ప కాపాడే అవకాశం లేకుండా పోయింది. పెన్నా నదిలో గల్లంతైన గణేష్ కోసం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన గణేష్ నదిలో ఇసుక ఊబిలో కూరుకు పోయారా! నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారా ! అన్న కోణాల నుంచి గాలింపు చేపట్టారు.