అప్పు ఇచ్చి బంగారు నగలకు ఎసరు

అవసరం కోసం బంగారం కుదవ పెట్టిన బాధితులకు నగల వ్యాపారి టోపీ పెట్టాడు.

Update: 2024-10-11 13:54 GMT

దిశ, మెట్ పల్లి : అవసరం కోసం బంగారం కుదవ పెట్టిన బాధితులకు నగల వ్యాపారి టోపీ పెట్టాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన రాకేష్ స్థానికంగా జ్యువెలర్స్ షాపు నిర్వహిస్తున్నాడు. సైడ్ బిజినెస్ గా వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు. అవసరం కోసం బంగారం కుదువ పెట్టిన వారితో పాటు నగలు చేయాలని బంగారం ఇచ్చిన వారికి కొద్ది రోజులుగా దొరకకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పండుగ కోసం ఇంటికి వచ్చిన నగల వ్యాపారి రాకేష్ ను బాధితులు నిలదీశారు. తమ బంగారం తమకు ఇవ్వాల్సిందిగా నిరసనకు దిగారు.

    అయితే మీ బంగారం తన దగ్గర లేదని, మీరు నా దగ్గర పెట్టినట్లే నేను మరో వడ్డీ వ్యాపారి వద్ద ఉంచానని చెప్పడంతో బాధితులు ఖంగు తిన్నారు. దీంతో బాధితులందరూ రాకేష్ తో సహా వెళ్లి వడ్డీ వ్యాపారి ఇంటి ముందు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం మెట్ పల్లి కి చెందిన నగల వ్యాపారి ఇదే తరహాలో రెండు కోట్ల వరకు వసూళ్లకు పాల్పడి ఐపీ పెట్టాడు. తాజాగా రాకేష్ వ్యవహారంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయమై స్థానిక ఎస్సైను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 

Tags:    

Similar News