ఈత చెట్టు పై నుండి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు

జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు అమర గాని చంద్రయ్య గౌడ్ గురువారం ఈత చెట్టు పైనుండి పడగా తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2024-09-26 03:40 GMT

దిశ, జూలపల్లి: జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు అమర గాని చంద్రయ్య గౌడ్ గురువారం ఈత చెట్టు పైనుండి పడగా తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుపూసకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నుపూస ఎముకలు విరిగాయని ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జూలపల్లి అధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.


Similar News