ఆధార్ కార్డు లేక.. పాము కాటుకు గురైన బాలిక మృతి

పాము కాటుకు గురైన ఓ బాలికకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ సిబ్బందికి

Update: 2024-12-15 13:08 GMT

దిశ, తాండూరు : పాము కాటుకు గురైన ఓ బాలికకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే క్రమంలో అంబులెన్స్ సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆ బాలిక మృత్యువాత పడిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం నందవరం గ్రామానికి చెందిన బుడుగ జంగం సంగీత గత రాత్రి 11 సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పాముకాటుకు గురైంది. దీంతో వైద్యం కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించాలన్నారు. వెంటనే 108 అంబులెన్స్ ని పిలిపించారు. 180 సిబ్బందికి బాలిక అమ్మమ్మకు ఆధార్ కార్డు ఇవ్వమని అడిగగా లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది హైదరాబాద్ కు తరలించలేదు. దీంతో రెండు గంటల పాటు బాలికకు ఆక్సిజన్ పెట్టక సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.


Similar News