రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ధర్మాజీ పేట గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది
దిశ,దుబ్బాక : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ధర్మాజీ పేట గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామానికి చెందిన నర్మల దేవయ్య (55) అనే వ్యక్తి వృత్తిరీత్యా రైస్ మిల్లులో హమాలి కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేటలోని మహంకాళి అమ్మవారి పండుగకు వారి బంధువుల ఇంటికి దావత్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చౌదర్పల్లి ధర్మాజీ పేట దర్గా సమీపంలో ద్విచక్ర వాహనం సైకిల్ ఢీకొని రోడ్డు ప్రమాదంలో దుంపలపల్లి గ్రామానికి చెందిన నర్మల దేవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సైకిల్ పై వస్తున్న ధర్మాజీ పేట గ్రామానికి చెందిన గట్టు కిరణ్ (25) అనే వ్యక్తికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని దుబ్బాక పోలీసులు తెలిపారు.