బ్రిడ్జి దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబైలోని మలాద్ ప్రాంతంలో 6,000 కిలోల ఇనుప వంతెనను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ముంబైలోని మలాద్ ప్రాంతంలో 6,000 కిలోల ఇనుప వంతెనను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద పెద్ద విద్యుత్ తీగలను తరలించేందుకు కాలువపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. జూన్ 26న అదానీ కంపెనీ నుంచి వంతెన చోరీకి గురైందని ఫిర్యాదు అందింది. అక్కడ కొత్త వంతెన నిర్మించడంతో ఈ పాత బ్రిడ్జిని ఉపయోగించడం లేదు. ఈ పాత బ్రిడ్జిని దాదాపు రూ.లక్షల వ్యయంతో నిర్మించారు.
ఇక బ్రిడ్జిని దొంగలెత్తుకెళ్లారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు వంతెన నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థకు చెందిన ఉద్యోగి. తదుపరి విచారణ జరుగుతోందని బంగూర్ నగర్ సీనియర్ పోలీసు అధికారి ప్రమోద్ తావ్డే తెలిపారు.