వీడు తండ్రేనా : కన్న కూతురని చూడకుండా.. దారుణం

రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు.

Update: 2022-11-22 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. రక్తసంబంధం అనికూడా మరి దారుణాలకు ఒడిగడుతున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి కూలి పని చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మద్యం సేవించి ఇంటికి వచ్చే ఆయన, ఆదివారం రాత్రి తాగి వచ్చాడు. అందరు నిద్రిస్తున్న సమయంలో, తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటనను గమనించిన స్థానికులు ఆయనకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Similar News