పండగ పూట విషాదం.. వాగులో పడి రైతు మృతి..
ప్రమాదవశాత్తు రైతు వాగులో పడి మృతి చెందిన ఘటన గుంజలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, మాక్లూర్ : ప్రమాదవశాత్తు రైతు వాగులో పడి మృతి చెందిన ఘటన గుంజలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గోపు భోజన్న( 50) తన పొలానికి నీటి తడులు అందించేందుకు వాగులో నుంచి పైపు ఫిట్టింగ్ చేసే క్రమంలో వాగులో పడి మృతి చెందారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.