నదిలో స్నానానికని వెళ్లి మృత్యువాత

ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన వేమనపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2025-03-14 15:26 GMT
నదిలో స్నానానికని వెళ్లి మృత్యువాత
  • whatsapp icon

దిశ,వేమనపల్లి : ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన వేమనపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వేమనపల్లి గ్రామానికి చెందిన కంపెల లక్ష్మి - బాపు దంపతుల కుమారుడు రాజ్ కుమార్ (19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా వేమనపల్లి గ్రామంలో హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.

    ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హోలీని ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం రాజ్ కుమార్ తన స్నేహితులతో కలిసి ప్రాణహిత నది పేట రేవు వైపు స్నానానికి వెళ్లి నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 


Similar News