Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం

రోడ్డు ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2025-03-21 04:15 GMT
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో 13 మందికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొర్రూర్ (Torrur) మండల పరిధిలోని చర్లపాలెం (Charlapalem) గ్రామానికి చెందిన మహిళలు మిర్చి తోటకు కూలీ పనికి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నర్సింహులపేట (Narsimhulupet) మండల పరధిలోని పెద్ద నాగారం (Pedda Nagaram) స్టేజ్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ఆ దుర్ఘటనలో మొత్తం 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఏరియా ఆసుపత్రి (Mahbubnagar Area Hospital)కి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News