మూడు రోజుల క్రితం అదృశ్యం అయిన వ్యక్తి శవమై..
మూడు రోజుల క్రితం చేపల పట్టేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం కాగా నేడు
దిశ, తూప్రాన్ : మూడు రోజుల క్రితం చేపల పట్టేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం కాగా నేడు శవమై తేలాడు. మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మన్నె అజయ్ కుమార్ మూడు రోజుల క్రితం గ్రామ చెరువు చింతల కుంట చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యాడు. మూడు రోజులుగా గాలించినా ఆచూకీ లభించలేదు శుక్రవారం చెరువులో శవమై తేలాడు.