లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. ఐదుగురు మృతి

ఆగి ఉన్న ట్రక్కును మినీ బస్సు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలో కలబురగి జిల్లాలోని నెలోగి క్రాస్ సమీపంలో ఉదయం 3:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

Update: 2025-04-05 07:14 GMT
లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. ఐదుగురు మృతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆగి ఉన్న ట్రక్కును మినీ బస్సు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి (Five people died) చెందారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలో కలబురగి జిల్లాలోని (Kalaburagi District) నెలోగి క్రాస్ సమీపంలో ఉదయం 3:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న మినీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని బాగల్‌కోట్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురగి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..ఈ మినీ బస్సు కలబురగి జిల్లాలోని ఒక దర్గాకు వెళుతుండగా.. రోడ్డు పక్కన టైర్ పంక్చర్ కారణంగా ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ టైర్ మారుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత మినీ బస్సు (Mini bus) డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Similar News