గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు..

నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని జిల్లా స్టేషన్ ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు.

Update: 2023-03-03 14:33 GMT

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని జిల్లా స్టేషన్ ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ తనిఖీల్లో భుక్య సుమలత, నచ్చన్ ఎల్లాపూర్ (5 లీటర్లు), చీమల లక్ష్మి, ఎనుగందుల జై లక్ష్మి, అంబరి పెట్ (8 లీటర్లు) నుంచి నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నామన్నారకు. అంతే కాకుండా వారిపై కేసునమోదు చేశామని జిల్లా స్టేషన్ ఎక్సైజ్ ఎస్సై రాయ బారపు రవికుమార్ తెలిపారు.

ముగ్గురు నిందితులను మండల తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగి ఉండేందుకు బైడోవర్ చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. నచ్చన ఎల్లాపూర్ (తాండ), అంబరి పెట్, శివారులో గుడుంబా తయారుకోసం ప్లాస్టిక్ డ్రమ్ములలో పులియబెట్టిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని నేలమట్టం చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టేషన్ ఎక్సైజ్ ఎస్సై రాయబరపు రవికుమార్, సిబ్బంది రషీద్, నరేందర్, గౌతమ్, వెంకటేష్, నిరోషా పాల్గొన్నారు.

Tags:    

Similar News