కన్నతల్లి, కట్టుకున్న భార్య ఇద్దరూ కలిసి హత్య చేశారా..? హన్మాపూర్ గ్రామంలో మరో హత్య

వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో మరో హత్య కలకలం రేపింది

Update: 2025-03-19 09:09 GMT
కన్నతల్లి, కట్టుకున్న భార్య ఇద్దరూ కలిసి హత్య చేశారా..? హన్మాపూర్ గ్రామంలో మరో హత్య
  • whatsapp icon

దిశ, పెద్దేముల్: వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో మరో హత్య కలకలం రేపింది. బుధవారం నాడు తెల్లవారుజామున హత్య జరిగినట్లు తెలుస్తుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలంలోని హన్మాపుర్ గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిత్యం చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవని, అయితే బుధవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ మృతుని కన్న తల్లి, కట్టుకున్న భార్య హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..? కాగా హన్మపూర్ గ్రామంలో వారం రోజులక్రితమే ఒక్క హత్య జరిగిన విషయం తెలిసిందే. తాండూర్ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, తాండూర్ రూరల్ సీఐ నాగేష్, పెద్దేముల్ ఎస్సై శ్రీధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. అనుమనితులైన మృతుని తల్లి, లక్ష్మమ్మ, భార్య సబితాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

తల్లిదండ్రులు దూరమైన దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

తండ్రి హత్యకు గురయ్యాడు, తల్లి, నాన్నమ్మ పోలీసుల అదుపులో ఉండటం తో దిక్కు లేని వారిగా, దిక్కుతోచని స్థితిలో మృతుని ఇద్దరు పిల్లలు వారి ఇంటి వద్ద ఉండి పోయి తమ తల్లి దడ్రులకోసం రోదిస్తున్న దృశ్యం గ్రామస్తులను కలిచివేసింది.

Read More..

వ్యవసాయ కూలి మృతి.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపణ…  


Similar News