అప్పులు తీర్చలేక హమలీ ఆత్మహత్య

అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లా వర్గల్ కు చెందిన కిష్టానోల్ల నర్సింలు(58) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Update: 2025-03-21 09:51 GMT
అప్పులు తీర్చలేక హమలీ ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, వర్గల్: అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లా వర్గల్ కు చెందిన కిష్టానోల్ల నర్సింలు(58) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నర్సింలు వృత్తి హమాలీ కాగా.. కూతురి పెళ్లికి రూ. 10 లక్షల అప్పు చేశాడు. ఇటీవల కాలికి గాయం అవడంతో ఇంటి వద్ద ఉంటూ తాగుడుకు బానిసయ్యాడు. తాగొద్దని భార్య ఆండాలు మందలించడంతో పాటు అప్పు తీర్చే మార్గం లేక పొలం వద్దకు వెళ్లి ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తెలిపారు.

Similar News