కుక్క అరుపులకు విసుగెత్తి ఆ కుక్క ఓనర్‌ని.. ఎవ్వరూ ఊహించలేదు!!
యువత ఓపిక, సహనాలకు తిలోదకాలిచ్చారు. Because his dog is barking continuously
దిశ, వెబ్‌డెస్క్ః మనిషిలో సహనం నశించడం వల్ల ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నేటి తరంలో చాలా మంది యువత స్టార్ట్ ఫోన్‌కి, ఇంటర్నెట్‌కి బానిసై, ఓపిక, సహనాలకు తిలోదకాలిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనే దీనికి ఉదాహరణ. ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 17 ఏళ్ల టీనేజర్ ఓ కుక్క అరుపులకు విసుగుచెంది, దారుణానికి ఒడిగట్టాడు. నజఫ్‌గఢ్‌లోని నాంగ్లీ డైరీ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర్లో ఓ పెంపుడు కుక్క ఎప్పుడూ మొరుగుతూనే ఉండటం ఆ యువకుడికి చికాకు కలిగించింది. కొన్ని రోజుల క్రితం ఆ కుక్కను తన యజమాని ముందే చితకబాదాడు. దాడిని అడ్డుకున్న ఆ కుక్క యజమాని అశోక్ కుమార్‌కు యువకుడికి మధ్య అప్పుడే వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన యువకుడు వెంటనే ఇనుప రాడ్‌తో 85 ఏళ్ల అశోక్ కుమార్‌పై బలంగా దాడి చేశాడు. స్పృహతప్పి పడిపోయిన ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, రెండో రోజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య మీనా ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు పరారిలో ఉన్న యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.