crime : అదుపు తప్పిన బైక్... ఒకరు మృతి
టూ వీలర్ అదుపుతప్పి కిందపడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి ( young man died)చెందిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది.
దిశ, ఖమ్మం రూరల్ : టూ వీలర్ అదుపుతప్పి కిందపడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి ( young man died)చెందిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏ. వీరబాబు(36) (A.Veera Babu)పెయింటింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఖమ్మం నుంచి పొన్నెకల్లు వైపు వెళ్తుండగా అదుపుతప్పిన టు వీలర్ కిందపడడంతో వీరబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.