గంజాయి కేసులో నిందితుడి రిమాండ్

గంజాయి పట్టుబడిన కేసులో నిందితుడిని రిమాండ్ కి పంపినట్లు సీఐ నీలం రవి తెలిపారు.

Update: 2025-01-08 15:08 GMT

దిశ,పెగడపల్లి : గంజాయి పట్టుబడిన కేసులో నిందితుడిని రిమాండ్ కి పంపినట్లు సీఐ నీలం రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నరసింహుని పేట గ్రామ శివారులో ఆదివారం గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా నలుగురు వ్యక్తులు పట్టుబడగా అదే రోజున వారిని అరెస్ట్ చేశారు. వారికి గంజాయి అమ్మిన ఇంద్రవెల్లి మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ఆనక సురేష్ అనే వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టుకి పంపినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రవి కిరణ్, పోలీస్ సిబ్బందిని అభినందించారు. 


Similar News