చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులపై సీఐడీ ఛీఫ్ సమీక్ష
చైల్డ్పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఐడీ ఛీఫ్ మహేశ్‌భగవత్ సిబ్బందికి సూచించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: చైల్డ్పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఐడీ ఛీఫ్ మహేశ్‌భగవత్ సిబ్బందికి సూచించారు. పదే పదే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమనుకుంటే సస్పెక్ట్ షీట్లు తెరవటంతో పాటు ముందస్తు అరెస్టులు చేయాలన్నారు.చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ముప్పయి ఒక్క కేసులపై ఆయన శనివారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే నలభైమూడు మందిని అరెస్టు చేసినట్టు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. కాగా, సమీక్షా సమావేశం ముగియగానే మరో పది కేసుల్లో ఇరవై ఒక్క మందిని అరెస్టు చేసినట్టు సీఐడీ ఛీఫ్ మహేశ్‌భగవత్‌కు సమాచారం అందింది.
చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ప్రజల నుంచి సమాచారం తెలుసుకునేందుకు ఇప్పటికే ట్రిప్లైన్స్వ్యవస్థ పని చేస్తోందని సీఐడీ ఛీఫ్ మహేశ్ భగవత్‌చెప్పారు. దీనికి స్పందన బాగా వస్తోందంటూ ట్రిప్లైన్స్ నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు నలభై నాలుగు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఈ కేసులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తులు జరపాలని ఆయన సిబ్బందికి సూచించారు. నిందితులను అరెస్టు చేయటంతోపాటు వారికి శిక్షలు పడేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీసీపీ స్నేహా మెహ్రా, సైబర్క్రైమ్స్అడిషనల్ఎస్పీ టీ.వీ.హనుమంతరావు, డీఎస్పీ గుణశేఖర్, సైబర్క్రైమ్స్పోలీస్స్టేషన్ఇన్స్పెక్టర్ప్రసాద్, సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.