జర్నలిస్టు దారుణ హత్య

ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ హత్యకు గురయ్యారు.

Update: 2025-01-03 15:02 GMT

దిశ, చర్ల : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ముఖేష్ చంద్రకార్ హత్యకు గురయ్యారు. ఈనెల 1వ తారీఖు రాత్రి ఇంటి నుండి అదృశ్యమవ్వడంతో శుక్రవారం ముఖేష్ చంద్రకార్ తమ్ముడు యుకేష్ చంద్రకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసు అధికారులు ముఖేష్ చంద్రకార్ ను గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఓ రోడ్డు కాంట్రాక్టర్ ఇంటి ఆవరణలో గల సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.

     ఇదిలా ఉంటే డిసెంబర్ 30వ తేదీన కాంట్రాక్టర్ కు చెందిన రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకల జరుగుతున్నాయని ముఖేష్ చంద్రకార్ వార్త ప్రచురించారని, దానికి స్పందించిన ఛత్తీస్గఢ్ మంత్రి రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ముఖేష్ చంద్రకార్ పై కక్ష్య పెంచుకున్న కాంట్రాక్టర్ కిడ్నాప్ చేసి హత్య చేస ఉంటాడానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసు అధికారులు వెల్లడించాల్సి ఉంది. అతి చిన్న వయసులోనే జర్నలిస్టుగా ప్రస్థానం మొదలు పెట్టిన ముఖేష్ చంద్రకార్ ఎందరో జర్నలిస్టులకు స్పూర్తిగా నిలిచాడు. నిత్యం ప్రజల పక్షాన నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువైన వ్యక్తి హత్యకు గురవ్వడం పట్ల ప్రజలు, సీనియర్ విలేకరులు విచారం వ్యక్తం చేశారు. 


Similar News