Sonali Phogat మృతి కేసులో బిగ్ ట్విస్ట్! పార్టీలో బలవంతంగా అలా చేశారా? లీకైన వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో: నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మృతి కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమెకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని అందువల్లే ఆమె మరణించిందని తేలింది. ఈ విషయాన్ని గోవా పోలీసులు నిర్థారించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించిందని అంతా భావించినా కుటుంబ సభ్యులు సోనాలి ఫోగట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పోస్ట్ మార్టం నివేదికలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆమెది హత్యగా నిర్థారించారు.
గోవా ఇన్ స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ విష్ణోయ్ మాట్లాడుతూ ఓ పార్టీలో సొనాలి ఫోగట్‌కు ఓ అనుమానితుడు బలవంతంగా మత్తుపదార్థం అందించాడని ఆ కెమికల్ సేవించడంతో ఆమె తనపై నియంత్రణ కోల్పోయిందని చెప్పాడు. అనంతరం ఆమెను టాయిలెట్ లోకి తీసుకువెళ్లాడని ఆపై రెండు గంటల పాటు ఏం జరిగిందనేది వెల్లడి కాలేదని పేర్కొన్నారు. సోనాల్ ఫోగట్ మృతిపై ఆమె సోదరుడు రింకు ధాక సంచలన ఆరోపణలు చేశారు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని ఆస్తికోసమే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు.
సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్వీందర్లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు పదార్థాలు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్లని ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియోలు తీసేవారని ఆరోపించాడు. ఆ వీడియోల ఆధారంగా తిరిగి బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే రింకు ఆరోపణల నేపథ్యంలో సోనాల్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనాల్ తన పీఏ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్వీందర్ వాసితో సోనాలి సన్నిహితంగా డ్యాన్స్ చేయడం అనుమానాలకు కారణం అవుతోంది. కాగా వారిద్దరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని త్వరలో వారిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.