మూతబడిన కంపెనీ కొనసాగించడం కోసం మరో మార్గం.. ?
పొల్యూషన్ కంట్రోల్ అధికారుల హెచ్చరికలకు తలొగ్గిన ఇండస్ కేమ్ జిప్సం కేమ్ కంపెనీ నిర్వాహకులు లోలోపల కొనసాగిస్తున్నట్లు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
దిశ, తాండూర్ రూరల్: పొల్యూషన్ కంట్రోల్ అధికారుల హెచ్చరికలకు తలొగ్గిన ఇండస్ కేమ్ జిప్సం కేమ్ కంపెనీ నిర్వాహకులు లోలోపల కొనసాగిస్తున్నట్లు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తాండూర్ మండలం మిట్టబస్పల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఇండస్ కేమ్ జిప్సం కంపెనీ గత నెల ఏప్రిల్ 21న ఉన్నత అధికారులు సీజ్ చేశారు. కొన్నాళ్ళు మూతబడిన కంపెనీ మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాయంత్రం వేళ హైదరాబాద్ నుంచి ఒప్పందం ప్రకారం వ్యర్థపు ఆయిల్ రసాయనాలను లారీల ద్వారా తరలిస్తూ మరో దారిగుండా కంపెనీల్లోనికి ప్రవేశిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కంపెనీలో సీజ్ చేసిన జేసీబీ వాహనంతో గుట్టు చప్పుడు కాకుండా వారి పని వారు చేస్తున్నారని, ఉన్నత అధికారుల ద్వారా ఎలాంటి అనుమతులు రాకుండానే ఎందుకలా కొనసాగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాల కంటే వారి ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా కంపెనీ నిర్వాహకులు ఉన్నారని మండిపడుతున్నారు.