దిశ, చింతలమానేపల్లి : తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన మండిగా సాయి( 23) అనే వ్యక్తి మద్యానికి బానిసై తాగిన మైకంలో తన ఇంటి సమీపంలో సోమవారం రాత్రి పెరట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. మృతుని భార్య మండిగా భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.