రేషన్ బియ్యం కేసులో నిందితుడు రిమాండ్
రేషన్ బియ్యం డంప్ చేసి పట్టుపడ్డ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న మడికంటి శంకర్ అనే వ్యక్తిని మంగళవారం తిరుమలాయపాలెం పోలీసులు రిమాండ్ చేశారు.
దిశ,తిరుమలాయపాలెం : రేషన్ బియ్యం డంప్ చేసి పట్టుపడ్డ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న మడికంటి శంకర్ అనే వ్యక్తిని మంగళవారం తిరుమలాయపాలెం పోలీసులు రిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని అజ్మీరాతండా శివారు బోర్సగడ్డతండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన సుమారు 100 క్వింటాల (200 బస్తాల) రేషన్ బియ్యాన్ని ఎస్సై కూచిపూడి జగదీశ్ దాడులు చేసి పట్టుకున్న ఘటన విధితమే. ఈ ఘటనలో పిండిప్రోలు, బోర్సగడ్డ తండాకు చెందిన శంఖర్, రమేష్, నరేష్, రామకృష్ణ అనే నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మడికంటి శంకర్ అనే వ్యక్తిని రిమాండ్ చేసినట్లు తెలిపారు.