కల్తీ కల్లు కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
కల్తీ కల్లు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదుతో 2016లో నమోదైన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు సంవత్సరాల జైలు, రూ.లక్ష జరిమానా విధించారు.
తూప్రాన్, దిశ : కల్తీ కల్లు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదుతో 2016లో నమోదైన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు సంవత్సరాల జైలు, రూ.లక్ష జరిమానా విధించారు. నర్సాపూర్ అబ్కారీ సీఐ పద్మ తెలిపిన వివరాలు ప్రకారం.. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో కల్లు దుకాణం తనిఖీ సందర్భంగా కల్లులో మత్తు పదార్తాలు కలిపినట్లు నిర్దారించామని తెలపారు. కాగా, ఆ విషయంలో నిందితుడు నర్సాగౌడ్ కు మెదక్ అడిషనల్ సెషన్స్ జడ్జి లక్ష్మిశారద పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. జడ్జి తీర్పు మేరకు నిందితుడిని జిల్లా కేంద్ర కారాగారం సంగారెడ్డికి తరలించామని సీఐ పద్మ తెలిపారు.