అమ్మ దూరమైందన్న ఆవేదనతో కొడుకు ఆత్మహత్య
అమ్మ మృతి చెందిన ఐదు నెలలకే ఆవేదనతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, అల్వాల్ : అమ్మ మృతి చెందిన ఐదు నెలలకే ఆవేదనతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బేతప్ప తెలిపిన వివరాల ప్రకారం సుభాష్ నగర్ లో నివాసం ఉండే ఎస్కే అమృత ఐదు నెలల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. అమృత కుమారుడు ఎస్కే భరత్( 29) సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చికిత్స నిమిత్తం బంధువులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తల్లి మృతి చెందడంతో నాటి నుండి మనోవేధనకు గురవుతున్నాడని, దీంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.