Breaking News : సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత

రాష్ట్రంలో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుకున్నారు పోలీసులు.

Update: 2025-01-03 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో దాదాపు వంద కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. జహీరాబాద్(Jahirabad) లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. కారును సీజ్ చేశారు పోలీస్ అధికారులు.   

Tags:    

Similar News