అనారోగ్యంతో వృద్దుడు ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతూ వృద్దుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-12-31 15:27 GMT

దిశ, అల్వాల్ : అనారోగ్యంతో బాధపడుతూ వృద్దుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ కు చెందిన కేదార్నాథ్(65) బతుకుతెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి హస్మత్ పేట్ లోని ఓ కేటరింగ్ షాప్ లో వాచ్​మన్ గా పనిచేస్తున్నాడు.

    కడుపులో నొప్పి వస్తుండడంతో ఎనిమిది నెలల క్రితం హాస్పిటల్ కి వెళ్లగా హెర్నియా ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ తరుచూ అనారోగ్యానికి గురవుతుండడంతో తాళలేక సోమవారం రాత్రి కేటరింగ్ షాప్ సమీపంలోని షెడ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, 5 మంది కొడుకులు ఉన్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లోని స్వగ్రామంలో ఉంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News