హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు
హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
దిశ, బుగ్గారం : హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేకల్ల గ్రామానికి చెందిన మైదం శంకరయ్యకు అదే గ్రామానికి చెందిన ఒడ్నాల పోచమల్లుకు మద్యం సేవిస్తున్న ప్రదేశంలో గొడవ జరిగింది. ఈ గొడవను మనసులో పెట్టుకొని శంకరయ్యను చంపాలనే ఉద్దేశంతో పోచమల్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడవగా తీవ్ర గాయాలైన శంకరయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుని అల్లుడి ఫిర్యాదు మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు ఒడ్నాల పోచమల్లును కోర్టులో హాజరు పరచగా జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదు తో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఇన్స్పెక్టర్ లు నాగేందర్, లక్ష్మీబాబు, ఎస్ఐ రవీందర్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్, లైజనింగ్ కానిస్టేబుల్ కిరణ్ నిందితునికి శిక్ష పడడంలో ప్రముఖ పాత్ర వహించారు. వీరిని జిల్లా ఎస్పీ అభినందించారు.