బెల్టు షాప్ కోసం ట్యాంక్ ఎక్కిన యువకుడు.. అసలు విషయం ఇదే

గ్రామంలోని సమస్యలు పరిష్కరించిన తర్వాతే మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహించాలని నిరసిస్తూ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

Update: 2022-09-25 12:05 GMT

దిశ, లోకేశ్వరం: గ్రామంలోని సమస్యలు పరిష్కరించిన తర్వాతే మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహించాలని నిరసిస్తూ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మన్మధ్ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహణ కోసం ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు.

దాంతో అదే గ్రామానికి చెందిన ఆలూరి ప్రవీణ్ రెడ్డి అనే యువకుడు ముందుగా గ్రామంలో గల ఎస్సారెస్పీ తదితర భూముల సమస్యలు పరిష్కరించాలని, ఆ తర్వాతే బెల్ట్ షాప్ కోసం వేలంపాట నిర్వహించాలని కోరారు. కానీ గ్రామస్తులు అతని మాట పట్టించుకోకపోవడంతో గ్రామంలోని ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంకు ఎక్కి వేలంపాట నిలపాలని, లేదంటే ట్యాంక్ పై నుండి దూకుతానని హంగామా సృష్టించినట్లు సమాచారం. వెంటనే గ్రామస్తులు లోకేశ్వరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Tags:    

Similar News