హైదరాబాద్‌లో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

మహనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Update: 2023-04-24 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో.. మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకు అఘాయిత్యాలు కూడా పెరిగిపోతున్నాయి. హత్యలు, యువతులపై అత్యాచారాలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒక చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పరిధిలోని బోరబండ బంజారానగర్‌లో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడు గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి సురేష్ ప్రేమను నిరాకరించడంతో.. ప్రేమించాలంటూ యువతి వెంట పడుతున్నాడు. అయినప్పటికీ యువతి పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన సురేష్ సోమవారం యువతి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు వెంటనే నిందితుడు సురేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News