ఆర్మూర్లో హైటెక్ వ్యభిచారం.. దర్జాగా నడిపిస్తున్న ప్రజాప్రతినిధి!
ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్, యోగేశ్వర్ కాలనీల పరిసర ప్రాంతాల్లో దర్జాగా రాజకీయం ముసుగులో ఓ ప్రజాప్రతినిధి వ్యభిచార దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
దిశ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్, యోగేశ్వర్ కాలనీల పరిసర ప్రాంతాల్లో దర్జాగా రాజకీయం ముసుగులో ఓ ప్రజాప్రతినిధి వ్యభిచార దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. వ్యభిచార గృహ నిర్వహణ కోసం దూర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో యువతులను మారువేషాల్లో తీసుకొచ్చి వీటులతో దర్జాగా వ్యభిచారం నడుపుతున్నట్లు ఆర్మూర్లో విమర్శలు గుప్పుమంటున్నాయి. పట్టణం నడిబొడ్డున ఇంత నీచమైన దందా జరుగుతున్నా.. ఆర్మూర్ పోలీసులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యభిచార గృహానికి రోజూ యువకులు, ప్రముఖులు పదుల సంఖ్యలో వచ్చి జేబులు ఖాళీ చేసుకుంటూ తిరిగి వెళుతున్నారని సమచారం. ఈ తంతుపై బహిరంగంగా నగర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని మండిపడుతున్నారు. ఇకనైనా పోలీసులు స్పందించి.. రాజకీయం ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్న సదరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read more:
నిద్ర పోతున్న నిఘా వ్యవస్థ.. పల్లెల్లో కూడా పేకాట, క్రికెట్ బెట్టింగ్!
భద్రాద్రి కొత్తగూడెంలో అవినీతి గని..మాట వినకుంటే అంతే సంగతులు!