Murder Case: వ్యాపారి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న రానా
హైదరాబాద్ వ్యాపారి రమేశ్ కుమార్ మర్డర్ కేసు(Hyderabad businessman Ramesh Kumar murder case)లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాపారి రమేశ్ కుమార్ మర్డర్ కేసు(Hyderabad businessman Ramesh Kumar murder case)లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటక పోలీసుల(Karnataka Police) కస్టడీ నుంచి ఏ1 నిందితుడు అంకుర్ రాణా(Ankur Rana) తప్పించుకున్నాడు. శుక్రవారం పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చారు. రాత్రి హోటల్‌లో బస చేయగా పోలీసుల కళ్లుగప్పి కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని వ్యూహాత్మకంగా అంకుర్ రాణా తప్పింకున్నాడు. దీంతో నిందితుడితో పాటు తన ఫోన్ కోసం పోచారం పోలీసులను కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్ ఆశ్రయించాడు. ప్రస్తుతం అంకుర్ రాణా(Ankur Rana) కోసం అటు కర్ణాటక, ఇటు తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త రమేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఉప్పల్- భువనగిరి ప్రాంతంలో హత్య చేసి డెడ్ బాడీని కర్నాటకలోని కొడగు కాఫీ ఎస్టేట్(Coffee Estate)లో తగుల బెట్టారు. రమేష్ హత్యకు అతని భార్య నిహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కారణమని పోలీసులు గుర్తించారు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి ఆరా తీశారు. హర్యానాకు చెందిన అంకుర్ రాణా అనే వ్యక్తి సాయంతో నిహారిక, నిఖిల్ ఇద్దరూ కలిసి ఊటీ దగ్గర ఉన్న కాఫీ ఎస్టేట్‌కి తీసుకెళ్లారు. అక్కడ రమేష్ శవాన్ని తగలబెట్టారు. రూ.8 కోట్ల ఆస్తి కోసమే తన భర్తను నిహారిక చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అంకుర్ రాణా(Ankur Rana)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకురాగా కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని తప్పించుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.