చిన్న పాటి గొడవ.. ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారితీసింది..
హోలీ ఈవెంట్ లో చిన్న తగాదా యువకుడిపై కత్తిపోట్లకు దారితీసిన

దిశ, మేడిపల్లి: హోలీ ఈవెంట్ లో చిన్న తగాదా యువకుడిపై కత్తిపోట్లకు దారితీసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చౌదరిగూడ క్రికెట్ గ్రౌండ్ లో హోలీ ఈవెంట్ లో బోడుప్పల్ కి చెందిన ఉప్పు ఆదిత్య (25) తన మిత్రులతో పాల్గొన్నాడు. సౌండ్ సిస్టమ్ వద్ద కాలు తాకిందని కొందరితో చిన్న తగాదా జరిగింది.
ఆదిత్య అతని నలుగురు స్నేహితులు అక్కడినుండి వెళ్లి నారపల్లి చౌరస్తా వద్ద నిలబడి ఉండగా అక్కడికి కొంతమంది దుండగులు బైక్ పై వచ్చి ఆదిత్యను కత్తితో పొడిచి పరారయ్యారు. కడుపులో రెండు చోట్ల, ఎడమ చేతిపై గాయాలు అయ్యాయి. ఆదిత్య ఉప్పల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సందర్భంగా ఆదిత్య తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చౌదరిగూడ కు చెందిన ఇద్దరు నిందితులు జైకృష్ణ, శివశంకర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.
READ MORE ...
మీడియా రిపోర్టర్‌ల మంటూ.. రూ.10 వేలు డిమాండ్.. చాకచక్యంగా వ్యవహరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్
Biryani Center: అదిరే ఆఫర్‌తో పెరిగిన గిరాకీ! బిర్యానీ సెంటర్ నిర్వహకులపై దాడి