పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
భార్య కేసు పెట్టిందన్న మనస్తాపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లిలో కలకలం రేపింది.
దిశ, పల్నాడు: భార్య కేసు పెట్టిందన్న మనస్తాపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లిలో కలకలం రేపింది. ఘటనకు సంబంధించి సేకరించిన సమాచారం ప్రకారం.. మేడికోండూరు మండలం పాలడుగు చెందిన కోటి స్వాములు కు సత్తెనపల్లి మండలం భీమవరం చెందిన అంకమ్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మొదట తాపీ మేస్త్రీ గా పనిచేస్తూ జీవనం సాగించిన కోటి స్వాములు కొంతకాలం క్రితం బాప్టిజం తీసుకుని చర్చి ఏర్పాటు పాస్టర్‌గా ఆధ్యాత్మిక సేవలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చర్చికి వస్తున్న ఓ మహిళతో కోటి స్వాములు సన్నిహితంగా ఉండునట్లుగా భార్య ఆరోపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి భార్యాభర్తలు మధ్య తరచు వివాదాలు జరిగాయి.
దీంతో పెద్దలు వీరిద్దరికీ నచ్చజెప్పి సజావుగా ఉండాలని రాజీ కుదిర్చారు. అయితే కొంత కాలంగా ముగిసిన వివాదం తిరిగి మొదటి వచ్చింది. పాస్టర్ కోటి స్వాములు భార్య నిన్న తిరిగి భర్త పై సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోటి స్వాములను స్టేషన్ కు రమ్మని పిలిచారు. స్టేషన్ వచ్చిన అతన్ని పోలీసులు భార్య భర్తలు బయటకు వెళ్లి మాట్లాడుకోని రావాలని పంపారు. భార్య తరచూ స్టేషన్ ఫిర్యాదు చేసి అగౌరవ పరుస్తుందని మనస్తాపానికి గురైన పాస్టర్ కోటి స్వాములు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పాస్టర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే కోటి స్వాములు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.