గోదావరి నదిలో మునిగి యువకుడు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయి పేట గ్రామానికి చెందిన ఆకుదారి ప్రశాంత్ (17) అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి గోదావరి నదికి వెళ్లారు

Update: 2024-11-20 14:49 GMT

దిశ,పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయి పేట గ్రామానికి చెందిన ఆకుదారి ప్రశాంత్ (17) అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి గోదావరి నదికి వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగగా ఇద్దరు స్నేహితులు తక్కువ లోతులో నుండే బయటకు వచ్చారు. ప్రమాదవశాత్తు ప్రశాంత్ కొంచెం ముందుకు వెళ్ళగానే వరదలో నీట మునిగి చనిపోయినట్లు పలిమెల ఎస్ఐ తమాషా రెడ్డి తెలిపారు. మృతదేహాన్నీ సాయంత్రం వెలికితీసి పోస్ట్ మార్టం కోసం మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Similar News