ఎర్ర తేలు కుట్టి మహిళకు అస్వస్థత

పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళకు ఎర్ర తేలు కుట్టి అస్వస్థతకు గురైన సంఘటన సత్తుపల్లి మండలం రంగాపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

Update: 2024-11-20 15:49 GMT

దిశ,సత్తుపల్లి : పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళకు ఎర్ర తేలు కుట్టి అస్వస్థతకు గురైన సంఘటన సత్తుపల్లి మండలం రంగాపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన తాటి రమాదేవి, వ్యవసాయ పనుల నిమిత్తం సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామం నుంచి రంగాపురం గ్రామానికి వేరుశనగ పంటను కోసేందుకు వెళ్లిన మహిళలకు పొలంలో ఎర్ర తేలు కుట్టడంతో అస్వస్థతకు గురైంది.

    వెంటనే పక్కన ఉన్న కూలీలు తేలును గుర్తించి చంపి మహిళను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 


Similar News