Murder: తమిళనాడులో దారుణం.. కోర్టు ఎదుటే న్యాయవాదిపై కత్తితో దాడి

కోర్టు ఎదుటే న్యాయవాది(Lawyer)పై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటు చేసుకుంది.

Update: 2024-11-20 17:09 GMT

దిశ, వెబ్ డెస్క్: కోర్టు ఎదుటే న్యాయవాది(Lawyer)పై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం కన్నన్(Kannan) అనే న్యాయవాది హోసూరు కోర్టు(Hosoor Court) నుండి బయటకి వస్తున్నాడు. ఆ సమయంలో అదే కోర్టులో క్లర్కు(Clerk)గా పని చేస్తున్న ఆనంద్, కన్నన్(Anand) పై వేట కొడవలితో దాడి చేశాడు. దీంతో కన్నన్ ఒక్కసారిగా నేలకూలాడు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న కన్నన్ పై ఆనంద్ పలు మార్లు పాశవికంగా దాడి చేశాడు. అనంతరం ఆనంద్ సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. సహచర లాయర్లు కన్నన్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News