రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, కీసర : స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాంపల్లి గ్రామానికి చెందిన వారిమాట్ల ఏలెంద్ర (35) ఎలక్ట్రిక్ స్కూటీ పైన వెళ్తున్నాడు. కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్ నెం 8 వద్ద వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టి అతని పైనుండి టైర్లు వెళ్లడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతడిని వైద్య చికిత్సల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించాడు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గుర్రాల లక్ష్మణ్ (27) పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.