భర్త డ్యూటీకి వెళ్లడం లేదని వివాహిత ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో ఓ గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దిశ, కూకట్పల్లి : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో ఓ గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళంకు చెందిన ఉమాపతి, దేవి(35)లు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వినాయకనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉమాపతి సరిగా డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ భార్య దేవితో తరచూ గొడవలు పడుతుండే వాడు.
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవుతుండటంతో మనస్థాపం చెందిన దేవి బుధవారం ఇంట్లోని గదిలో ఫ్యాన్ హుక్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దేవి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు సీఐ నరసింహరాజు తెలిపారు.