ప్రైవేట్ హాస్టల్లో మహిళ అసభ్య ప్రవర్తన.. వంట పాత్రల్లో ఆ పని..!
కరీనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్ లో దారుణం జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: కరీనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన నిర్వాహకులు కంపు గొట్టే ఆహారం అందించారు. దీనంతటికీ కిచెన్ లో పని చేసే ఓ మహిళ కారణం అనే విషయం సీసీ కెమెరాలో చూస్తేగానీ అర్థం కాలేదు. ఇంతకు ఏం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్ ఉంది. అయితే కొన్ని రోజులుగా హాస్టల్ వడ్డించే ఆహారంతో పాటు వంట పాత్రలు కంపుగొడుతున్నాయి. తట్టుకోలేక విద్యార్థులు విషయాన్నిహాస్టల్ నిర్వాహకులకు తెలియజేశారు.
దీంతో అసలు కిచెన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాను పరిశీలించిన నిర్వాహకులు షాక్ తిన్నారు. కిచెన్ లో పని చేస్తున్న ఓ మహిళ వంట పాత్రల్లో మూత్ర విసర్జన చేసి ఆ పాత్రల్లోనే వంట చేస్తున్నట్లు అందులో రికార్డు అయ్యింది. దీంతో సదరు మహిళకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్వాహకులు ఆమెను వెంటనే పని నుంచి తొలగించారు. కాగా మహిళ అసభ్య ప్రవర్తన పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ అసభ్య ప్రవర్తన
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2023
ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బైట పడింది. దీంతో మహిళను పనినుండి తొలగించారు. pic.twitter.com/tyhsYgGGV3