ముద్దులతో న్యూసెన్స్​ చేసిన జంట అరెస్ట్​

నడి రోడ్డుమీద బైక్​పై ముద్దులు పెట్టుకుంటూ న్యూసెన్స్​ చేసిన జంటను బాలాపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-26 15:29 GMT

దిశ, బడంగ్ పేట్​ : నడి రోడ్డుమీద బైక్​పై ముద్దులు పెట్టుకుంటూ న్యూసెన్స్​ చేసిన జంటను బాలాపూర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి నోటీసులు జారీ చేశారు. బాలాపూర్​ ఇన్​స్పెక్టర్​ తోట భూపతి తెలిపిన వివరాల ప్రకారం కోల్​కతాకు చెందిన మొహమ్మద్​ వాసిఫ్​ ఆర్షద్ ​ గచ్చిబౌలిలోని భాను పీజీ హాస్టల్​ లో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణ శర్మ హైటెక్​ సిటీలో ప్రైవేట్​ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని సిటీ ప్రశాంతి ఉమెన్​ పీజీ హాస్టల్​లో ఉంటుంది. మొహమ్మద్​ వాసిఫ్​ ఆర్షద్, అన్నపూర్ణ శర్మ లు స్నేహితులు.

    ఈనెల 22వ తేదీన మొహమ్మద్​ వాసిఫ్​ ఆర్షద్ బైక్​ పై అన్నపూర్ణ శర్మ తో కలిసి ఆదిభట్లలోని స్నేహితులను కలవడానికి వెళ్లారు. అయితే పహాడిషరీఫ్​లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద బైక్​ పెట్రోల్​ ట్యాంక్​ పై రివర్స్​లో కూర్చొని ముద్దులు పెడుతూ నడి రోడ్డుపై న్యూసెన్స్​ చేశారు. ఇది కాస్త సోషల్​ మీడియాలో ప్రచారం కావడంతో బాలాపూర్​ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్​ నెంబర్​ ను పసిగట్టారు. దీంతో సాంకేతిక ఆధారంగా రోడ్డు పై న్యూసెన్స్​ చేసిన స్నేహతులను పోలీసులు అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News