13 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం
ఛత్తిస్ గఢ్ లోని బస్తార్ లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణపై ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బస్తార్: ఛత్తిస్ గఢ్ లోని బస్తార్ లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణపై ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలికకు మత్తు కలిపిన శీతల పానియం ఇచ్చి ఈ నెల 11, 12 తేదీల్లో అత్యాచారం చేసినట్టు బోధ్ ఘాట్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. 13వ తేదీ ఫిర్యాదు చేయడంతో మైనర్ బాలుడితో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు జుడీషియల్ కస్టడీకి పంపగా.. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు పంపినట్టు ఆ అధికారి చెప్పారు.
ఇవి కూడా చదవండి : ఘోరం.. కన్న కూతురిపై కసాయి తండ్రి అత్యాచారం