బంకర్లో పడి వ్యక్తి సజీవ సమాధి?
అర్జీ 2 పరిధిలోని మూతపడిన 7 ఎల్ఈపీ గని ఇసుక బంకర్లోని పనులను పర్యవేక్షించేందుకు అక్కడికి వెళ్లిన హెడ్ ఓవర్ మాన్ తిట్ల సత్యనారాయణ ప్రమాదవశత్తు అందులో పడిపోయాడు.
దిశ, గోదావరిఖని టౌన్ : అర్జీ 2 పరిధిలోని మూతపడిన 7 ఎల్ఈపీ గని ఇసుక బంకర్లోని పనులను పర్యవేక్షించేందుకు అక్కడికి వెళ్లిన హెడ్ ఓవర్ మాన్ తిట్ల సత్యనారాయణ ప్రమాదవశత్తు అందులో పడిపోయాడు. మంగళవారం ఇసుక బంకర్ల పనులను చూస్తుండగా అందులో జారిపడగా అక్కడ ఉన్న ఇసుక మొత్తం సత్యనారాయణపై పెద్ద ఎత్తున పేరుకు పోయింది. ఇప్పటి వరకు బాడీ దొరకలేదు. సింగరేణి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని సత్యనారాయణ మృతదేహం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారు. సింగరేణి రెస్కూ టీం ఎంత ప్రయత్నించినా ఇప్పటివరకు సత్యనారాయణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.