16 ఏళ్ల బాలిక హత్య.. నిందితుడు ఎలా దొరికాడండే..?
ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 16 ఏళ్ల బాలికను సాహిల్(20) అనే యువకుడు దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 16 ఏళ్ల బాలికను సాహిల్(20) అనే యువకుడు దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కత్తితో విచక్షణరహితంగా పొడవడంతో బాలిక స్పాట్లోనే చనిపోయింది. అయినప్పటికీ సాహిల్ బాలికను విడిచిపెట్టలేదు. కౄరంగా బండరాతితో బాదాడు. ఇదంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే ఈ దారుణం జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల చాలా మంది ఉన్నప్పటికీ ఒక్కరు కూడా సాహిల్‌ను ఆపె ప్రయత్నం చేయలేదు. అయితే.. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
నిందుతుడు చేయి మీద ఉన్న పచ్చబొట్టు ఆదారంగా హత్య చేసింది సాహిల్ అని దృవీకరించారు. కానీ, అప్పటికే సాహిల్ తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. అయితే పోలీసులు మాత్రం ఫోన్ ట్రాప్ చేయడం ఆపలేదు. ఈ క్రమంలోనే సాహిల్ గులంధర్ సహేర్ చేరుకున్న తర్వాత తన తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో అతడి ఆచూకి పోలీసులకు లభించింది. ఇక ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సాహిల్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. సాహిల్, బాలిక గత కొన్ని రోజులుగా రిలేషన్లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరు శనివారం సాయంత్రం గొడవపడ్డారని, ఆదివారం బాలిక తన స్నేహితురాలి కొడుకు పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా అడ్డగించి ఆమెను హత్య చేశాడు సాహిల్. అంతా కౄరంగా సాక్షిని హత్య చేసి చంపిన సాహిల్‌ను ఉరి తీయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.