అక్రమంగా మద్యం తరలిస్తున్న 11 మంది అరెస్ట్

జిల్లాలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు గత వారం రోజులు నుంచి భారీ దాడులు నిర్వహించారు.

Update: 2023-05-10 17:30 GMT

రూ.22.79 లక్షల విలువ గల మద్యం బాటిళ్లు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

దిశ, కామారెడ్డి రూరల్ : జిల్లాలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు గత వారం రోజులు నుంచి భారీ దాడులు నిర్వహించారు. జిల్లాలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పట్టుకోగా అతడి నంచి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట, నిజామాబాద్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.

తీగ లాగితే డొంక కదిలినట్టుగా కుక్యాల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. హర్యానా డిఫెన్స్ కు చెందిన సుమారు రూ.22.79 లక్షల విలువ గల 497 అక్రమ మద్యం బాటిళ్లు, ఒక కారు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డి తో సహా మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్, నారాయణ రెడ్డి, ఆకాశ్ రెడ్డి, వైవీ. రెడ్డిలను అరెస్టు చేయగా మరో ఇద్దరిపై విచారణ కొనసాగుతుందన్నారు.

హైదరాబాద్ నుంచి గోవా, హర్యానా రాష్ట్రాలకు వెళ్లే.. ప్రైవేట్ బస్సులను టార్గెట్ గా చేసుకుని రాష్ట్రంలో అక్రమం మద్యం డంపింగ్ చేసినట్లుగా సమాచారం. దీంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా రాష్ట్రంలోని అతిపెద్ద చైన్ సిస్టమ్ మద్యం మాఫియాగా డిప్యూటీ కమిషనర్ దశరథ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సెల్ ఫోన్ల ఆధారంగా మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News