క్రికెటర్ స్మృతి మంధనా పెళ్లాడుతానన్న స్టార్ హీరో ఇతడే..

దిశ, వెబ్‌డెస్క్ : మెన్స్ క్రికెటర్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా స్మృతి మంధనాకి ఎనలేని క్రేజ్ ఉంది. స్మృతి తన బ్యాటింగ్‌తో పాటు అందంతో నేషనల్ క్రష్‌గా మారింది. ఉమెన్స్ క్రికెటర్లు జనాల్లో ఆదరణ సంపాదించుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మహిళా క్రికెటర్లలో మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధనా. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఆమె ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ […]

Update: 2021-11-11 08:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెన్స్ క్రికెటర్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా స్మృతి మంధనాకి ఎనలేని క్రేజ్ ఉంది. స్మృతి తన బ్యాటింగ్‌తో పాటు అందంతో నేషనల్ క్రష్‌గా మారింది. ఉమెన్స్ క్రికెటర్లు జనాల్లో ఆదరణ సంపాదించుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మహిళా క్రికెటర్లలో మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధనా.

అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఆమె ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ హీరోయిన్స్‌కు స్మృతి ఏ మాత్రం తీసిపోదని చెబుతుంటారు. అయితే స్మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. చిన్నప్పుడు హృతిక్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది అని ముసిముసిగా నవ్వుతూ చెబుతోంది ఈ క్రికెట్ బ్యూటీ.

అయితే క్రికెట్‌లో టాప్‌గా నిలిచిన స్మృతి ఇప్పుడు బిజినెస్‌ ఉమన్‌గా కూడా మారింది. నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి వచ్చింది. దీంతో ఆమె మరింత ఎత్తుకు ఎదిగింది. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం రూ.50 లక్షల వరకు తీసుకుంటుందని టాక్. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు మార్కెట్ టాక్.

పెళ్లికి ముందే శృంగారం చేస్తే తప్పేంటి? : హాట్ బ్యూటీ

Tags:    

Similar News