ముగిసిన క్రికెట్ టోర్నీ.. విక్టరీ కొట్టిన కరకగూడెం ప్రెస్‌క్లబ్ టీం

దిశ, మణుగూరు : దసరా పండుగను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కరకగూడెం మండల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గత రెండ్రోజులుగా రంగపురం ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. అయితే, మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కరకగూడెం ప్రెస్‌క్లబ్ టీం ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పఠాన్ అతిక్ ఖాన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు గుడ్ల రంజిత్ కుమార్, సురేష్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం […]

Update: 2021-10-12 08:07 GMT

దిశ, మణుగూరు : దసరా పండుగను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కరకగూడెం మండల ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గత రెండ్రోజులుగా రంగపురం ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. అయితే, మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కరకగూడెం ప్రెస్‌క్లబ్ టీం ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పఠాన్ అతిక్ ఖాన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు గుడ్ల రంజిత్ కుమార్, సురేష్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన కరకగూడెం మండల ఎస్సై జీ.ప్రవీణ్ కుమార్ విజేతలకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అలాగే, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కాగా, ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన కరకగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూఖ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు దుర్గం ప్రేమ్ కుమార్, గుడ్ల రంజిత్, ఇల్లందుల సురేష్, బట్టా బిక్షపతి, అఫ్రోజ్, జాడి విజయ్ కుమార్, విష్ణు
తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News